- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్ అని ప్రజలు అనుకుంటున్నారు.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఐబొమ్మ రవి అంశంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ రవి అంశంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐ బొమ్మ రవిని ప్రజలు రాబిన్ హుడ్ అని అనుకుంటున్నారని తెలిపారు. టికెట్ ధరల భారాన్ని తమపై ఎందుకు రుద్దుతున్నారనే అసహనంలో ప్రజలు ఉన్నారని తెలిపారు. వేల కోట్లతో సినిమాలు తీస్తే బాగుపడేది నిర్మాత, డైరెక్టర్, హీరోలు మాత్రమేనని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే , హీరోయిన్లు, సినిమా సెట్‌లో పనిచేసేవారికి తక్కుగానే ఫీజు ఇస్తారని అన్నారు. వేల కోట్లు దోచుకునేది నిర్మాత, డైరెక్టర్, హీరో అని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఐ బొమ్మ రవి తమకు ఉచితంగా సినిమాలు చూపిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. అన్ని వేల కోట్లు పెట్టి సినిమాలు ఎందుకు తీస్తున్నారు.. మా పైన వాటిని టికెట్ ధరలు పెంచుతున్నారని ప్రజలు అనుకుంటున్నట్లు వెల్లడించారు. వంద కోట్లలో సినిమా తీయొచ్చు, రూ.50 కోట్లలో సినిమా చేయొచ్చన్నారు.






