- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న దుష్యంత్ రెడ్డి సస్పెండ్
కాంగ్రెస్ పార్టీ నుండి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న దుష్యాంత్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఐదేళ్ల పాటు పార్టీ నుండి దుష్యంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రాజాపూర్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్ నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ నుండి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న దుష్యంత్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఐదేళ్ల పాటు పార్టీ నుండి దుష్యంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రాజాపూర్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణయ్య యాదవ్ దుష్యంత్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. పలు భూ వివాదాల్లో దుష్యంత్ రెడ్డి తలదూర్చినట్టు కృష్ణయ్య యాదవ్ ఆరోపిస్తున్నారు.
ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తనను దొంగ అని సంభోదించినట్టు పేర్కొన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడినందుకు దుష్యంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతే కాకుండా దుష్యంత్ రెడ్డిపై రాజాపూర్ పోలీస్ట్ స్టేషన్, కాంగ్రెస్ పెద్దలకు సైతం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సోదరుడినే పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.






