TG News : కేటీఆర్ అహంకారం తగ్గించుకోక పోతే ఈసారి ఇంటికే : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(BRS MLA KTR) పై సిరిసిల్లలోని కేటీఆర్ మీద ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు(Congress MLA Adi SrinivasaRao) మరోసారి ఫైర్ అయ్యారు.

TG News : కేటీఆర్ అహంకారం తగ్గించుకోక పోతే ఈసారి ఇంటికే : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(BRS MLA KTR) పై సిరిసిల్లలోని కేటీఆర్ మీద ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు(Congress MLA Adi SrinivasaRao) మరోసారి ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని, అహంకారం తగ్గించుకోకపోతే ఈసారి ప్రజలు ఇంటికే పంపిస్తారని మండిపడ్డారు. అయితే నేడు సిరిసిల్ల కేటీఆర్ క్యాంప్ ఆఫీస్(KTR Camp Office) వద్ద ఫోటోల విషయంపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫొటో ఉండాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. వారు సీఎం ఫొటోతో ఆఫీస్‌కు వెళ్లడానికి ప్రయత్నించగా, బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

ఈ సంఘటనపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు స్పందిస్తూ.. క్యాంప్ ఆఫీస్ కేటీఆర్ వ్యక్తిగత సొంతం కాదని, అది ప్రభుత్వ ఆస్తి అని అన్నారు. సీఎం ఫొటో పెట్టడాన్ని కేటీఆర్ ఎందుకు నామోషీగా భావిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామనే కలలు కంటున్నారని, వారి అహంకారం తగ్గించుకోకపోతే ప్రజలు ఈసారి కేటీఆర్ క్యాంప్ ఆఫీస్‌ను ఖాళీ చేయిస్తారని హెచ్చరించారు. ఈ వివాదం సిరిసిల్లలో రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది.

Next Story