ఎమ్మెల్యే అనర్హత వేటుపై.. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

by Malleboina Mahesh |   (  Updated:2025-07-31 07:01:11  IST  )

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలప వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఎమ్మెల్యే అనర్హత వేటుపై.. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలప వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన వారు సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘకాలం పాటు ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం (Speaker's decision) తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై కోర్టే అనర్హత (Disqualification) వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్‌లను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

కాగా కోర్టు తీర్పుపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (MLA Adi Srinivas) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. "వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లు బిఅర్ఎస్ నాయకుల తీరు ఉందని పార్టీ మారిన ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని, ఉపఎన్నికలు వస్తాయని ప్రచారం చేశారని, శాసనసభ్యుల సభ్యత్వ రద్దు అధికారం కేవలం స్పీకర్ కే ఉంటుందని గుర్తు చేశారు. అలాగే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ (BRS) దుష్ప్రచారం చేసిందని, సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు అని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

Read More: కేసీఆర్‌తో ఫామ్‌హౌస్‌లో ఆ ముగ్గురు భేటీ.. ఆ మూడు అంశాలపైనే కీలక చర్చ!

Next Story