- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక విజ్ఞప్తి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) భేటీ అయ్యారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం(Vemulawada Temple) పరిధిలో ఆధునిక గోశాల నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆది శ్రీనివాస్ కోరారు. ఆధునిక గోశాల నిర్మాణం కోసం వేములవాడ సమీపంలోని మరిపెల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలం గుర్తించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కాగా, వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో ఇటీవల పలు కోడెలు మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా కోడెలు మృతి చెందినట్లు పశు వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో ఈ గోశాలలో ఇప్పటివరకు మృతిచెందిన కోడెల సంఖ్య 31కి చేరింది. ఈ క్రమంలోనే ఆధునిక గోశాల నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి ఆది శ్రీనివాస్ తీసుకొచ్చారు. ట్వీట్






