- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Inter question paper: ఇంటర్ ప్రశ్నపత్రాల్లో తప్పులు కంటిన్యూ.. ఇవాళ బోటనీ, మ్యాథ్స్ పేపర్లలో మిస్టేక్స్
ఇంటర్ ప్రశ్నపత్రాల్లో తప్పులు కంటిన్యూ అవుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఇంటర్ పరీక్ష ప్రశ్నపత్రాల్లో తప్పుల (Mistakes in Telangana Inter Exams) పరంపర కంటిన్యూ అవుతోంది. ఇవాళ కూడా రెండు పేపర్లలో కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. బోటనీ, మ్యాథ్స్ పేపర్లలో తప్పులు వచ్చినట్లు ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. బోటనీ 5,7 వ ప్రశ్న అలాగే మ్యాథ్స్ 4వ ప్రశ్నలో చిన్న చిన్న తప్పులు వచ్చాయి. విషయం గుర్తించిన ఇంటర్ బోర్డు సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో తప్పుగా ఉన్న ప్రశ్నలను సరిచేసి చెప్పాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అయితే నిన్న, మొన్న జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో (Question Papers) కూడా తప్పులు దొర్లాయి. మొన్న జరిగిన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో తలెత్తిన తప్పుతో ఆ ప్రశ్నను అటెంప్ట్ చేసిన విద్యార్థులకు ఫుల్ మార్కులు వేయాలని అధికారులు నిర్ణయించారు. నిన్ననిన్న కూడా మూడు పేపర్లలో తప్పులు దొర్లాయి. రోజూ ప్రశ్నపత్రాల్లో తప్పులు వస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు (Inter Board) అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






