హైదరాబాద్ బిర్యానీ‌పై మిస్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏం చెప్పిందో తెలుసా?

by Kema Shiva Kumar |

హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరిగిన మిస్‌ వరల్డ్-2025 (Miss World-2025) పోటీల్లో 72వ మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ (Thailand) సుందరి ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ (Opal Suchata Suangsri) నిలిచింది.

హైదరాబాద్ బిర్యానీ‌పై మిస్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏం చెప్పిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరిగిన మిస్‌ వరల్డ్-2025 (Miss World-2025) పోటీల్లో 72వ మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ (Thailand) సుందరి ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ (Opal Suchata Suangsri) నిలిచింది. ఈ మేరకు రూ.8.5 కోట్ల నగదుతో పాటు 1,770 వజ్రాలు పొదిగిన కిరీటం సుచాత సొంతమైంది. అదేవిధంగా ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు కూడా ఆమె అర్హురాలైంది. ఈ సందర్భంగా ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ మీడియాతో మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ అవ్వాలన్న కళ ఎట్టకేలకు సాకరమైందని అన్నారు. అందుకోసం తాను చాలా కష్టపడ్డానని తెలిపారు. తల్లితండ్రులు తనకు ఎంతగానో సహకారం అందించారని గుర్తు చేశారు. నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కగా.. అమ్మ ఇల్లు చూసుకుంటుందని పేర్కొన్నారు. హైదారాబాద్‌కు వచ్చాక బిర్యానీ (Biryani)పై అమితమైన ప్రేమ ఏర్పడిందని.. ఎప్పటికీ తన ఫెవరెట్ డిష్ అదేనని అన్నారు. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి తనకు ఎంతగానో నచ్చాయని కామెంట్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి మిస్ వరల్డ్ ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Next Story