రేపు తెలంగాణ సచివాలయాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ బ్యూటీలు

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందగత్తెలు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు.

రేపు తెలంగాణ సచివాలయాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ బ్యూటీలు
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందగత్తెలు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్యూటీను ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను తీసుకువెళుతున్నారు. ఇక నేడు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ డే ఈవెంట్‌లో సందడి చేస్తున్నారు. కాగా రేపు వీరు తెలంగాణ సచివాలయం మరియు ట్యాంక్ బండ్‌లను సందర్శించబోతున్నట్టు సమాచారం. అనంతరం ప్రభుత్వ పథకాలపై ముద్దుగుమ్మలు డ్రోన్ షోను వీక్షించనున్నారు. ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరుగుతుండటంతో పలు దేశాల నుండి ప్రముఖులు నగరానికి విచ్చేశారు. రాష్ట్రప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేయడంతో మిస్ బ్యూటీలు తెలంగాణ ఆతిథ్యానికి ఫిదా అవుతున్నారు. ప్రతి ఈవెంట్‌లో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు.

Next Story