- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana: కల్లు తాగిన మిస్ వరల్డ్ పోటీదారులు
తెలంగాణ రాష్ట్రంలో (Telangana ) మిస్ వరల్డ్ పోటీలు ( Miss World pageants) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలను తెలంగాణ

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో (Telangana ) మిస్ వరల్డ్ పోటీలు ( Miss World pageants) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా నిర్వహిస్తోంది. శనివారం రోజు నుంచి ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ మహానగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth reddy) చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఈ నెలాఖరు వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది.
అయితే ఈ పోటీలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ అందగత్తెలు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్లు ( Palm wine) తాగారు. తెలంగాణలో సహజంగా దొరికే నీరాకల్లును.. మిస్ వరల్డ్ పోటీదారులు సేవించారు. మేకప్ వేసుకునే ఈ నీరా కల్లు సేవించి... చాలా ఎంజాయ్ చేశారు. తెలంగాణ కల్లు చాలా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.






