- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Charminar Heritage Walk : చార్మినార్ కే అందం తెచ్చిన మిస్ వరల్డ్ భామలు
మిస్ వరల్డ్(Miss World) అందగత్తెలు నేడు హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్(Charminar) వద్ద హెరిటేజ్ వాక్(Heritage Walk) చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : మిస్ వరల్డ్(Miss World) అందగత్తెలు నేడు హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్(Charminar) వద్ద హెరిటేజ్ వాక్(Heritage Walk) చేశారు. ప్రపంచ సుందరీమణులు అంతా ఒక్క చోట కూడి చార్మినార్ కే వన్నెలు దిద్దారు. హెరిటేజ్ వాక్ వచ్చిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు సంప్రదాయ అరబ్బీ, మర్ఫా సంగీతంతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారంతా చార్మినార్ పరిసరాల్లో తిరుగుతూ సందడి చేశారు. చార్మినార్ వద్ద ఫోటోలు, సెల్ఫీలతో హాల్ చల్ చేస్తూ మైమరచి పోయారు. చార్మినార్ చరిత్రను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ కట్టడం ముందు అందగత్తెలు గ్రూప్ ఫోటో దిగారు. చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ నిర్వహించారు.
మరికాసేపట్లో వీరంతా సుప్రసిద్ధ చౌహముల్లా ప్యాలెస్(Chowmahalla Palace) లో ఏర్పాటుచేసిన ప్రత్యేక విందుకు హాజరవనున్నారు. కాగా అక్కడ మిస్ వరల్డ్ కాంటేస్టర్లకు మెహేంది వేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. చౌముల్లా ప్యాలెస్ లో నిజాం హయాంలో ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు, గృహోపకరణ సామాగ్రి, నిజాం నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చార్యలో భాగంగా.. చార్మినార్ పరిసరాల్లోని చిల్లర వర్తక దుకాణాలు మూసివేయించారు.






