Miss World: మిస్ వరల్డ్ పోటీలు.. హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ విన్నర్స్ వీరే..

by Ramesh Naini |

హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి.

Miss World: మిస్ వరల్డ్ పోటీలు.. హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ విన్నర్స్ వీరే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ (Miss World) పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. తాజాగా హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే (Head-to-Head Challenge Finale) హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్లో వైభవంగా జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం 20 మంది కంటెస్టెంట్స్‌ ఎంపిక అయ్యారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికా అండ్ కరేబియన్ ఖండాల నుంచి 20 మంది కంటెస్టెంట్స్ హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

వారు తమ వ్యక్తిత్వాన్ని, సామాజిక స్పృహను ప్రదర్శిస్తూ, మానసిక ఆరోగ్యం, మహిళా సాధికారత, విద్య, పర్యావరణ సంరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ వంటి కీలక విషయాలపై ప్రసంగించారు. ఇందులో మిస్ వేల్స్, మిస్ టర్కీ, మిస్ ట్రినిడాడ్, టొబాగో, మిస్ జాంబియా సుందరీమణులు హెడ్-టు-హెడ్ కాంటినెంటల్ విజేతలుగా ఎంపికయ్యారు. మిస్ వరల్డ్ హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ ఫైనల్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు దక్కలేదు. కాగా, ఈ నెల 31న గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఆ రోజే ప్రపంచ విన్నర్‌ను ప్రకటిస్తారు.

Next Story