- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్ భవన్‌లో మిస్ వరల్డ్-2025 విజేతలకు ఘన సన్మానం
హైదరాబాద్: 72వ మిస్ వరల్డ్ పోటీలలో విజేతలుగా నిలిచిన సుందరీమణులకు రాజ్ భవన్‌లో ఘన సన్మాన కార్యక్రమం

రాజ్ భవన్‌లో మిస్ వరల్డ్-2025 విజేతలకు ఘన సన్మానం
- సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు హాజరు
-విజేతలకు తెలంగాణ సాంప్రదాయ బహుమతులు ప్రదానం
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్: 72వ మిస్ వరల్డ్ పోటీలలో విజేతలుగా నిలిచిన సుందరీమణులకు రాజ్ భవన్‌లో ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలను అభినందించారు. హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల అనంతరం, విజేతలకు రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. టూరిజం, రవాణా శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రముఖులు ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు.
గిరిజన ఉత్పత్తులతో స్వాగతం:
రాజ్ భవన్‌కు విచ్చేసిన మిస్ వరల్డ్ విజేత థాయిలాండ్ కు చెందిన ఓపల్ సుచాతా చుయాంగ్ శ్రీ , ఆఫ్రికా కాంటినెంటల్ విజేత ఈథియోపియాకు చెందిన హస్సెట్ దేరేజే, యూరప్ కాంటినెంటల్ మిస్ పోలాండ్ మజ క్లాజ్డా, అమెరికన్-కరీబియన్ కాంటినెంటల్ విజేత మార్టినిక్ కు చెందిన ఆరెల్ల జోఅచ్ఛిమ్‌లకు గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. గిరిజనులు తయారుచేసిన అటవీ ఆకులతో రూపొందించిన స్వాగత వేదిక వద్ద మిస్ వరల్డ్ విజేతలు ఫోటోషూట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా హాజరయ్యారు. రాజ్ భవన్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయన సతీమణి, మిస్ వరల్డ్ విజేతలను సన్మానించారు.






