వారి ప్రేమ మరువలేనిది.. చార్మినార్ ప్రమాద ఘటనపై మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత ఎమోషనల్ పోస్ట్

by Ramesh Naini |   (  Updated:2025-06-03 11:19:11  IST  )

ఇటీవల మిస్ వరల్డ్-2025 కిరీటం గెలుచుకున్న థాయిలాండ్ సుందరీమణి ఓపల్ సుచాత తాజాగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఎమోషల్ పోస్ట్ చేశారు.

వారి ప్రేమ మరువలేనిది.. చార్మినార్ ప్రమాద ఘటనపై మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత ఎమోషనల్ పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల (Miss World-2025) మిస్ వరల్డ్-2025 కిరీటం గెలుచుకున్న థాయిలాండ్ సుందరీమణి ఓపల్ సుచాత (Miss World Suchata) తాజాగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఎమోషల్ పోస్ట్ చేశారు. మే 18న హైదారాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో (Gulzar House) గుల్జార్ హౌజ్‌‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఓపల్ సుచాత స్పందించారు. ప్రమాదం జరుగక ముందు తన పర్యాటనలో భాగంగా గుల్జార్ హౌజ్‌లో మోడీ పెరల్స్ షాపును సందర్శించిన విషయాలను, ఆ సమయంలో కలిసిన చిన్నారులు ప్రమాదంలో కన్నుమూశారని తెలుసుకోని భావోద్వేగం అయ్యారు.

తన పర్యటనలో (ముత్యాలు) పెరల్స్ పాప్‌లో తాను గడిపిన క్షణాలను ఆనందాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తెల్లటి, జీబ్రా-నమూనా దుస్తులు ధరించిన అమ్మాయిలు తనను కలవడానికి, ఫోటోలు తీయడానికి ఆసక్తిగా ఉన్నారని ఆమె ప్రేమగా గుర్తు చేసుకున్నారు. చిన్నారులు వారి ఇంటికి ఆహ్వానించారని, మరోసారి వస్తానని సుచాత వారికి చెప్పినట్లుగా పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లలతో పాటు, కుటుంబ సభ్యులు ప్రమాదంలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు నా పై చూపించిన ప్రేమ మరువలేనిది.. అని తెలిపారు.

నా విజయాన్ని చూడకుండానే ప్రమాదంలో కన్నుమూయడం బాధాకరం.. ఇది నా హృదయాన్ని కలిచి వేస్తోందని వెల్లడించారు. ‘స్వర్గ ప్రాప్తిరస్తు.. మన తదుపరి జీవితంలో మళ్ళీ కలుద్దాం’ అని ఆవేదనతో షాప్‌లో చిన్నారులతో దిగిన ఫోటోను ఓపల్ సుచాత (Opal Suchata) పోస్ట్ చేశారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నట్లు కామెంట్స్ పెట్టారు.

Next Story