'రాను బొంబాయికి రాను' పాటకు స్టెప్పులు వేసిన మిస్ వరల్డ్ బ్యూటీలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-23 12:32:47  IST  )

హైద‌రాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచంలోని పలుదేశాల నుండి అందెగత్తెలు విచ్చేసిన సంగతి తెలిసిందే. వారిని అధికారులు కీలక పర్యాటక ప్రదేశాలకు, ముఖ్యమైన ప్రదేశాలకు

రాను బొంబాయికి రాను పాటకు స్టెప్పులు వేసిన మిస్ వరల్డ్ బ్యూటీలు
X

దిశ, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచంలోని పలుదేశాల నుండి అందెగత్తెలు విచ్చేసిన సంగతి తెలిసిందే. వారిని అధికారులు కీలక పర్యాటక ప్రదేశాలకు, ముఖ్యమైన ప్రదేశాలకు తీసుకువెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు అందగత్తెలు సూరూర్‌నగర్‌‌లోని విక్టోరియా హెమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సోషల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మిస్ వరల్డ్ బ్యూటీలు సరగా గడిపారు.

ఈ క్రమంలో పిల్లలతో కలిసి రాను ముంబాయికి రాను అనే తెలంగాణ జానపద పాటకు స్టెప్పులు వేశారు. పాటకు కోరస్ ఇస్తూ వారు స్టెప్పులు వేయగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే రాను ముంబాయికి రాను అనే జనపద పాట యూట్యూబ్‌లో విడుదలై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ పాటకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ అయ్యారు. అంతే కాకుండా యూట్యూబ్ లో ఈ పాటకు మిలియన్స్ కొద్దీ వ్యూవ్స్ వచ్చాయి. ఈ పాటకు రాము రాథోడ్ లిరిల్స్ అందించడంతో పాటూ పాటలో డ్యాన్స్ కూడా చేశాడు. ఇక ఇప్పుడు ప్రపంచ సుందరీలు కూడా డ్యాన్స్ చేయడంతో పాటకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.

Next Story