- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్వాలలో మైనర్‌పై కత్తితో దాడి: చికిత్స పొందుతున్న బాధితుడు
by Yella Dhawani Reddy |
గద్వాల పట్టణంలోని కొటా కాలేజ్ వెనుకభాగంలో బుధవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: గద్వాల పట్టణంలోని కొటా కాలేజ్ వెనుకభాగంలో బుధవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే 17 ఏళ్ల రవి తేజ అనే యువకుడిపై పరిచయమైన వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడ్డారు. సుమారు సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో రవి తేజ ఎడమ ఛాతీ భాగంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఎడమ 5వ రిబ్ దగ్గర కత్తిపోటు గాయం ఉన్నట్లు నిర్ధారించారు. ప్రాథమిక చికిత్స అందిస్తున్న అధికారులు ఈ ఘటనను మెడికో లీగల్ కేసుగా నమోదు చేశారు (MLC No. 7255). ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితునికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
Next Story






