- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ సుంకాలపై కీలక ప్రకటన విడుదల చేసిన వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
గత కొద్ది రోజులుగా భారత్ పై బెదిరింపుల వైఖరి కనబరిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తున్నందకు.. భారత్ పై 25 శాతం సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా భారత్ పై బెదిరింపుల వైఖరి కనబరిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తున్నందకు.. భారత్ పై 25 శాతం సుంకాలను (25 percent tariff hike) పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన టారిఫ్ లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Ministry of Commerce and Industry of India) స్పందిస్తూ.. కీలక ప్రకటణ చేసింది. "ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనను ప్రభుత్వం గమనించింది. ప్రభుత్వం దాని చిక్కులను అధ్యయనం చేస్తోంది. గత కొన్ని నెలలుగా భారతదేశం, అమెరికా న్యాయమైన, సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ముగించడంపై చర్చలలో నిమగ్నమై ఉన్నాయి. మేము ఆ లక్ష్యానికి కట్టుబడి ఉన్నాము" మా రైతులు, వ్యవస్థాపకులు, MSMEల సంక్షేమాన్ని రక్షించడానికి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంది. UKతో తాజా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంతో సహా ఇతర వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది." అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.
- Tags
- Donald Trump






