- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి చర్చలు సఫలం
by Muthe.Rajitha |
జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేపట్టిన చర్చలు సఫలం అయ్యాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో: జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేపట్టిన చర్చలు సఫలం అయ్యాయి. నేటి కాటన్ మిల్లులు బంద్‌ను కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ విరమించుకుంది. దాంతో పత్తి కొనుగోళ్లు యథావిధిగా కొనసాగనున్నాయి. జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్స్‌పై సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో మంత్రి తుమ్మల మాట్లాడారు.
జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డితోనూ చర్చలు జరిపారు. జిన్నింగ్ మిల్లర్స్‌కు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్లు జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ప్రకటించారు. మంత్రి తుమ్మల హామీతో సమ్మె విరమించినట్లు చెప్పారు.
Next Story






