- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేయబోయే రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ ఏర్పాట్లపై మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, వాకిటి శ్రీహరి సమీక్ష చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేయబోయే రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ ఏర్పాట్లపై మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, వాకిటి శ్రీహరి సమీక్ష చేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభ/రోడ్‌షోను విజయవంతం చేయడానికి స్థానిక నేతలతో కలిసి ఏర్పాట్లపై కసరత్తు చేశారు. సీఎం పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా పర్యటన మార్గాన్ని భద్రతా సిబ్బందితో పూర్తి సమన్వయం చేసుకోవాని సూచించారు. సభా స్థలం వద్ద మరియు రోడ్‌షో మార్గంలో పటిష్టమైన బందోబస్తుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, వెంగళ్రావు నగర్ డివిజన్ (వారి ఇన్‌ఛార్జ్ ప్రాంతం) నుండి పెద్ద ఎత్తున ప్రజలను, పార్టీ శ్రేణులను సభకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాస్వామ్య పండుగలా జరిగే ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి తుమ్మల కోరారు.






