- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ministers: సామాజిక న్యాయానికి చాంపియన్ కాంగ్రెస్ పార్టీ
రాహుల్ గాంధీ ఆలోచన మేరకే బీసీ రిజర్వేషన్ల(BC Reservations)కు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ ఆలోచన మేరకే బీసీ రిజర్వేషన్ల(BC Reservations)కు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం వారు గాంధీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘2023 డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఫిబ్రవరి 4, 2024న అసెంబ్లీలో కులగణనపై తీర్మానం చేశాం. పార్లమెంట్ ఎన్నికల కారణంగా ప్రక్రియ కొంత ఆలస్యం అయింది. ఫిబ్రవరి 4, 2025న అసెంబ్లీలో ఆమోదించుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు అంతా కలిసి చట్టం చేశారు. అక్కడి నుంచి గవర్నర్‌కు, రాష్ట్రపతి పంపించాం. ఫైనల్‌గా నిన్న 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది బీసీలపై తమకున్న నిబద్ధత’ అని మంత్రులు అన్నారు.
బీజేపీ ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇస్తామని చెప్పి.. కీలక సమయంలో అధ్యక్షుడిగా కొనసాగుతున్న బీసీ నేత బండి సంజయ్‌ను తొలగించారని విమర్శించారు. బీజేపీ బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని అన్నారు. ‘మీ పార్టీలో దయ్యాలు ఉన్నాయని మీరే అన్నారు.. దానిపై మీ పార్టీలో చర్చ చేయండి. మా పార్టీలో ముఖ్యమంత్రి రెడ్డి అయితే.. అధ్యక్షుడిగా బలహీన వర్గాలకు చెందిన బిడ్డ కొనసాగుతున్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం. సామాజిక న్యాయానికి చాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.






