- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి ప్రాణాలు తీసుకోకండి.. కార్మికుల సంక్షేమమే మాకు ముఖ్యం : మంత్రులు పొన్నం, శ్రీధర్
ఆర్టీసీ కార్మికులు క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో తెలిపారని.. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సుదీర్ఘ కేబినెట్ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించి పూర్తిగా సానుకూలంగా ఉన్నామని వివరించారు. ఉద్యోగ భద్రతపై ఎలాంటి అపోహలు వద్దని, ఒక్క ఉద్యోగిని కూడా ప్రభుత్వం తొలగించదని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ ప్రకారమే పనిచేస్తున్నామని, కేబినెట్ లో మంత్రులంతా కార్మికులకు అనుకూలంగా చర్చించారన్నారు.
ఆర్టీసీలో పనిచేసే ప్రతీ కార్మికుడికి మంత్రి శ్రీధర్ బాబు కూడా కీలక విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు, ధర్నాపై కేబినెట్ లో కీలకంగా చర్చించామని తెలిపారు. కార్మికులు సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా చర్చలు చేపడుతుందన్నారు. అంతవరకూ ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని, ఎవ్వరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. ఇలాంటి ఆలోచనలు చేయవద్దన్నారు. కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇలా ఆత్మహత్యలు చేసుకునేందుకు కాదన్న విషయం గుర్తుంచుకోవాలని, క్షణికావేశంతో కుటుంబాలకు అన్యాయం చేయవద్దన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని కోరారు.






