- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chintan Shivir: డెహ్రాడూన్ బయలుదేరిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క.. ఎందుకంటే?
ఆదివారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తదితర అధికారులు డెహ్రాడూన్ బయలుదేరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక న్యాయం సాధికారత పై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈ నెల 7,8 తేదీల్లో డెహ్రాడూన్‌లో చింతన్ శివిర్ (Chintan Shivir) కార్యక్రమం జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చేసిన వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన మంత్రులు చింతన్ శివిర్‌లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆదివారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంత్రులు (Ponnam Prabhakar) పొన్నం ప్రభాకర్, సీతక్క (Minister Seethakka) తదితర అధికారులు డెహ్రాడూన్ బయలుదేరారు. రెండు రోజుల పాటు (Dehradun) డెహ్రాడూన్‌లో జరగనున్న చింతన్ శివిర్‌లో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలు, వారి సంక్షేమం, అభివృద్ధి, దేశానికి దిక్సూచిగా కుల గణన, బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలు తదితర అంశాలపై మంత్రి సీతక్క ప్రసంగించనున్నారు.
ఈ చింతన్ శివిర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ శాఖల ద్వారా ఉన్న చట్టాలు, అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రాలు, కేంద్రం కలిసి పని చేసే అంశంపై చర్చలు జరుపనున్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్లు, మద్యం వ్యసనం, మాదకద్రవ్యాల దుర్వినియోగ బాధితులు, లింగమార్పిడి వ్యక్తులు, యాచకులు, మాన్యువల్ స్కావెంజర్స్, సంచార తెగలు, ఆర్థికంగా వెనుకబడిన వారు వైకల్యాలున్న వ్యక్తులు సమాజంలోని వివిధ విభాగాల ద్వారా సంక్షేమం కోసం వివిధ చట్టాలు పథకాల అమలుపై చింతన్ శివిర్‌లో చర్చలు చేయనున్నారు. మంత్రులతో పాటు కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు వెళ్తున్నారు.






