- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bibi ka Alam: బీబీకా ఆలంను సందర్శించిన మంత్రులు.. మొహర్రం ఏర్పాట్లు పూర్తి
మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లోని డబీర్ పురా లోని (Bibi-Ka-Alam) బీబీకా ఆలంను శనివారం మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మొహర్రం (Muharram) సందర్భంగా హైదరాబాద్‌లోని డబీర్ పురా లోని (Bibi-Ka-Alam) బీబీకా ఆలంను శనివారం మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman) సందర్శించారు. ఈ సందర్భంగా బీబీకా ఆలంలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎఫండీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు అంతా మొహర్రం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
వందల సంవత్సరాల ఆనవాయితీగా వస్తున్న ఊరేగింపు కోసం ఏనుగును ఇప్పటికే తీసుకురావడం జరిగింది. కాగా, మొహర్రం పర్వదినం పురస్కరించుకొని గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు కొనసాగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది.






