Ministers Surekha: వాంకిడి గిరిజన విద్యార్థులను పరామర్శించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నంలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-11-05 10:13:32  IST  )

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల(Vankidi Tribal Ashram School)లో అనారోగ్యానికి గురైన విద్యార్థినులను నిమ్స్ హాస్పిటల్(Nimes Hospital) లో మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)లు పరామర్శించారు.

Ministers Surekha: వాంకిడి గిరిజన విద్యార్థులను పరామర్శించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నంలు
X

దిశ, వెబ్ డెస్క్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల(Vankidi Tribal Ashram School)లో అనారోగ్యానికి గురైన విద్యార్థినులను నిమ్స్ హాస్పిటల్(Nimes Hospital) లో మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వారు నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు త్వరగా కొలుకునే విధంగా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు వారు భరోసా కల్పించారు. విష అహారంతో అస్వస్థత పాలై వివిధ ఆసుపత్రుల్లో ఉన్న వారందరికి మంచి వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదని, అందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story