- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే తీసుకోకండి: మంత్రులు
రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆయా జిల్లాలో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు రేషన్‌దుకాణాల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆయా జిల్లాలో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు రేషన్‌దుకాణాల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు. కార్డులో పేరున్న వారిలో ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పన ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేయలేదని, తెలంగాణలో మాత్రమే చేసిందన్నారు. రేవంత్సర్కార్తీసుకున్న గొప్ప నిర్ణయమని మంత్రులు పొగిడారు.
ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తుందని, ప్రజలు విపక్ష పార్టీల మాటలు నమ్మొద్దని కోరారు. ఈనెలాఖరు వరకు బియ్యం పంపిణీ ఉంటుందని, రాష్ట్రంలో ఉన్న 90 లక్షల కార్డుల ద్వారా 2.85 కోట్ల మందికి బియ్యం అందిస్తామని లబ్ధిదారులు తొందర పడవద్దని ప్రతీ ఒకరికీ ఇస్తామని చెప్పారు. అదే విధంగా ఇకనుంచి డీలర్లు దొడ్డు బియ్యం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు సూచించారు.
సన్నబియ్యం పంపిణీతో పీడీఎస్రైస్అక్రమ రవాణాకు చెక్‌పడుతుందని, సన్నబియ్యం అందరూ వినియోగించుకోవాలని సూచించారు. కొత్తకార్డుల కోసం దరఖాస్తులు చేసిన వివరాలు అధికారులు పరిశీలన చేస్తున్నారని, ఇంటింటి సర్వే పూర్తి కాగానే మే నెలలో అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. తరువాత ఫిజికల్‌గా కార్డులు అందజేస్తామని అందులో బీపీఎల్కుటుంబాలకు మూడు రంగుల కార్డులు, ఏపీఎల్కుటుంబాలకు గ్రీన్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.






