గవర్నర్‌ను కలవనున్న మంత్రులు, అఖిలపక్ష నేతలు.. అపాయింట్‌మెంట్ ఫిక్స్

by Kema Shiva Kumar |

బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై తెలంగాణ మంత్రులతో పాటు అఖిలపక్ష ఎమ్మెల్యేలు ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma)ను కలవనున్నారు.

గవర్నర్‌ను కలవనున్న మంత్రులు, అఖిలపక్ష నేతలు.. అపాయింట్‌మెంట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై తెలంగాణ మంత్రులతో పాటు అఖిలపక్ష ఎమ్మెల్యేలు ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma)ను కలవనున్నారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఇప్పటికే అన్ని పార్టీ ఫ్లోర్ లీడర్లకు ఇవాళ గవర్నర్ వద్దకు కలిసి వెళ్దామంటూ లేఖలు రాశారు. ఇవాళ ఉదయం 11.30కి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా ఫిక్స్ అయింది. బీసీ‌లకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ.. రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీ (Assembly)లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడ్ ఆఫ్ హౌజ్‌ను పరిగణనలోకి తీసుకొని స్థానిక సంస్థల్లో బీసీ‌లకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, అఖిల‌పక్ష నేతలు కోరనున్నారు. గవర్నర్‌ను కలవబోయే వారిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, పలువురు బీసీ ఎమ్మెల్యేలు, అఖిలపక్ష నేతలు ఉన్నారు.

Next Story