మాదిగలకు మంత్రి పదవి డిమాండ్ కాదు.. రిక్వెస్ట్: ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-28 04:36:17  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)పై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మాదిగలకు మంత్రి పదవి డిమాండ్ కాదు.. రిక్వెస్ట్: ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)పై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావొస్తున్నా ఈ విషయంలో అధిష్టానం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తోంది. తాజాగా సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)​ ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal)​తో సమావేశమై మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర కార్యవర్గ అంశాలపై చర్చించిన నేపథ్యంలో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అంతా రహస్యంగా భేటీ అవ్వడం చర్చకు దారి తీస్తోంది. వారంతా ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారా ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలవబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతోందనే టెన్షన్ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

ఈ క్రమంలోనే కేబినెట్‌ విస్తరణపై జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు (MLA Lakshmi Kantha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ సంఖ్యను బట్టి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. తెలంగాణ (Telangana) జనాభాలో 18 శాతం మంది మాదిగలు ఉన్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలుతో సీఎం రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేశారని.. రాజీయంగా కూడా గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాయని కామెంట్ చేశారు. మాదిగలకు మంత్రి పదవి డిమాండ్ కాదు.. రిక్వెస్ట్ అని అన్నారు. దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha)కు అనుభవం దృష్ట్యా మంత్రి పదవి వచ్చిందని.. ఆయన మంత్రి పదవిని కులాల ప్రాతిపదికన చూడాల్సి అవసరం లేదన్నారు. మాదిగలు ఎప్పుడూ కాంగ్రెస్ పక్షానే ఉన్నారని.. భవిష్యత్తులో కూడా ఉంటారని కామెంట్ చేశారు. మాదిగలు పార్టీకి చేసిన సేవలను గుర్తించాలని, మా ఆకాంక్షను అధిష్టానానికి చెప్పేందుకే నిన్నటి మీటింగ్ అని ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు అన్నారు.

Next Story