- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
రాబోయే ఏడాదికి స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని, ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కృత్రిమ మేధస్సు ఆధారిత కోర్సులు సహా కొత్త నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రారంభించాలని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి అధికారులకు సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే ఏడాదికి స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని, ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కృత్రిమ మేధస్సు ఆధారిత కోర్సులు సహా కొత్త నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రారంభించాలని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులకు సూచించారు. గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ యువత ఉపాధి అవకాశాలు పెంచేలా అన్ని కొత్త కోర్సులు ప్రస్తుతంతో పాటు భవిష్యత్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. పరిశ్రమల ప్రమాదాలను నివారించేందుకు ఫ్యాక్టరీల శాఖ భద్రతా ప్రమాణాలు, సన్నద్ధతను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
సిగాచీ ఘటన కార్మికుల భద్రత, సంక్షేమంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టంచేశారు. అదేవిధంగా ఈఎస్ఐ తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని బీమా చేసిన వ్యక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఐపీల నుంచి ఫిర్యాదులు రావడం సహించబోమని, అవసరమైన చోట అదనపు డిస్పెన్సరీలు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సేవలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ శాఖల అధికారులు సచివాలయంలోని కలిశారు. వారి శుభాకాంక్షలను స్వీకరిస్తూ, అధిక బాధ్యత, నిబద్ధత తో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానా కిషోర్, ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ పాల్గొన్నారు.






