TG: ప్రేమ్ సాగర్‌ రావుతో గొడవ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) కీలక వ్యాఖ్యలు చేశారు.

TG: ప్రేమ్ సాగర్‌ రావుతో గొడవ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పదేండ్లు మంత్రులతో ప్రజలు మాట్లాడే అవకాశం లేకుండేదని అన్నారు. కానీ.. తమ సీఎం అలా కాదని.. పాశమైలారం ఘటన జరిగిన వెంటనే రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లారని అన్నారు. బాధితులను పరామర్శించారు. వారిలో ధైర్యం నింపారని తెలిపారు. గతంలో కొండగట్టు అంత పెద్ద ఘటన జరిగినా కూడా.. కేసీఆర్‌ అక్కడికి వెళ్లిన పాపాన పోలేదని విమర్శించారు. పాశమైలారం ఘటన వద్దకు సీఎం వెళ్లినా కూడా కేటీఆర్ వెళ్ళలేదు అనే ప్రచారం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసుల పహారా ఉంటుండే.. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు దర్జాగా మంత్రులను కలుస్తున్నారని అన్నారు.

నో ఇష్యూస్..

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(Prem Sagar Rao)తో గొడవపైనా మంత్రి వివేక్ స్పందించారు. ‘జిల్లాకు ఎమ్మెల్యేనే రాజు.. ఆ రాజుకు మంత్రుల సహాయం అవసరమైతే చేసి పెడతాం’ అని వివేక్ క్లారిటీ ఇచ్చారు. ప్రతీ పార్టీలో గొడవలు, గ్రూపు రాజకీయాలు కామన్ అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పార్టీలో గొడవలు ఉన్నాయని తెలిపారు. కేటీఆర్, కవిత మధ్య గొడవలు లేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తను మీనాక్షి నటరాజన్ గుర్తిస్తున్నారు.. అందరికీ అవకాశాలు ఇస్తారని అన్నారు. పాత, కొత్త కలుపుకొని పని చేస్తామని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది. గిగ్ వర్కర్స్‌కు కనీస వేతనం అందేలా చొరవ తీసుకుంటాం.. గిగ్ వర్కర్స్‌కు అండగా ప్రభుత్వం ఉంది అని భరోసా ఇచ్చారు.

Next Story