PashaMylaram : పాశమైలారం ఘటనపై హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి వివేక్

by Muthe.Rajitha |

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్‌ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్‌ పేలిన(Reactor Exploded) ప్రమాదంలో 14 మంది చనిపోగా.. మరో 35 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

PashaMylaram : పాశమైలారం ఘటనపై హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి వివేక్
X

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్‌ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్‌ పేలిన(Reactor Exploded) ప్రమాదంలో 14 మంది చనిపోగా.. మరో 35 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) చేసిన వ్యాఖ్యలను కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) ఖండించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి మదీనాగూడలోని ప్రణమ్, కాకతీయ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వివేక్.. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

గాయపడిన వారికి తక్షణమే ఆక్సిజన్ అవసరం ఉండి దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదని, బాధిత కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేయాలని హితవు పలికారు.

కాగా అంతకముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రమాద స్థలాన్ని పరిశలించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. "పొరుగు రాష్ట్ర మీడియా సంస్థకు ఏదో అయ్యిందని.. డిప్యూటీ సీఎంతో సహా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు... క్షణాల్లో అక్కడ వాలిపోయారని, ఇవాళ పాశమైలారంలో ప్రమాదం జరిగి అమాయక కార్మికుల ప్రాణాలు పోయి.. ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియక మరికొందరు కార్మికుల కుటుంబాలు కన్నీరు పండుతోంటే.. ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతోంటే... అధికార పార్టీ నుంచి ఏ ఒక్కరు అటువైపు పోలేదు.

అంటే బడాబాబులు ముఖ్యం కానీ.. పేద కార్మికులను సర్కారు పట్టించుకోదా..?" అని మండిపడ్డారు. ఏ ఒక్క కాంగ్రెస్ నేతకు ఇంత ప్రమాదం గురించి సమాచారం ఇంకా అందలేదా? క్షతగాత్రులను ఎందుకు కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించలేదని మండిపడ్డారు.

Next Story