- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నా ఇళ్లు అమ్మి అయినా బిల్లులు చెల్లిస్తా’.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి భరోసా
మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma indlu) లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma indlu) లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం చేయొద్దు.. ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత త్వరగా అకౌంట్లలో డబ్బులు పడతాయి. బిల్లులు రావు అనే భయంతో ఉండకూడదు అని చెప్పారు. లబ్ధిదారులు నిర్భయంగా ఇళ్లు కట్టుకోండి అని సూచించారు. నా ఇళ్లు, ఆస్తులు అమ్మి అయినా సరే మీ డబ్బులు మీకు చెల్లిస్తానని కీలక భరోసా ఇచ్చారు.
కాగా, మరోవైపు రాష్ట్రంలో పనులు ప్రారంభమైన (గ్రౌండింగ్ అయిన) ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య లక్ష దాటింది. ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 3,71,086 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 2,78,134 ఇళ్లకు అనుమతులు ఇచ్చింది. వీటిలో ఇంతవరకు 1,00,264 ఇళ్లకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి.






