- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేజస్వీ సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలి : మంత్రి వాకిటి డిమాండ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవగాహన లేకుండా, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా ఖండించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవగాహన లేకుండా, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రకారం, పార్లమెంట్ ఆమోదంతో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రక ప్రజాస్వామ్య ప్రక్రియ అని, దానిని ప్రశ్నించడం లేదా తక్కువ చేసి చూడడం అనేది కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానించడమేనని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న త్యాగాలు, పోరాటాలు తెలియకుండా ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నేతలు తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నారని మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ సూర్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై బీజేపీ నేతల వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు క్షమించరని మంత్రి శ్రీహరి హెచ్చరించారు.






