Vakiti Srihari: బనకచర్లపై మేం రెడీ.. హరీశ్ రావుకు మంత్రి వాకిిటి శ్రీహరి కౌంటర్

by Prasad Jukanti |

హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్ ఇచ్చారు.

Vakiti Srihari: బనకచర్లపై మేం రెడీ.. హరీశ్ రావుకు మంత్రి వాకిిటి శ్రీహరి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బనకచర్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కామెంట్స్ కు మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) కౌంటర్ ఇచ్చారు. బనకచర్లపై ఎక్కడైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బనకచర్ల (Banakacharla) విషయంలో హరీశ్ రావే కొంత తడబడినట్లు స్పష్టంగా అర్థం అవతున్నదని ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేపల పులుసు తిన రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని కేసీఆర్ చెప్ప లేదా అని ప్రశ్నించారు. వచ్చే వారం కృష్ణా నదీ జలాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని చెప్పారు.

బీజేపీ బీసీల పట్ల పక్షపాత వైఖరి చూపిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఆ పార్టీ వైఖరి మరోసారి స్పష్టం అయిందని కులగణన సర్వే జరిగాక కూడా బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి ఉందని ఇవాళ్టి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించినట్లు చెప్పారు. ఈ సమస్యలపై ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇవాళ వచ్చిన వినతుల్లో ఎక్కువగా ధరణి బాధితులే ఉన్నారని చెప్పారు. ఓ పేదవాడు నేరుగా మంత్రిని కలిసి సమస్య వినిపించడం కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమవుతుందన్నారు.

Next Story