- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మాత్రమే ముస్లింలు కనిపిస్తున్నారా?: మంత్రి వాకిటి కౌంటర్
by Gantepaka Srikanth |
తెలంగాణ బీజేపీ(BJP) నేతలపై మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(BJP) నేతలపై మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలపై చిత్తశుద్ధిని BJP నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ, గుజరాత్‌లో ముస్లింలు బీసీల్లో కలిసిలేరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మాత్రమే ముస్లింలు కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ సరైన నిర్ణయం తీసుకోవాలి.. లేకపోతే ప్రజల నుంచి మరో దెబ్బ తగలడం ఖాయమని మంత్రి వాకిటి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని చెప్పారు. రైతుభరోసా, 60 వేల ఉద్యోగాలు, రూ.500 గ్యాస్ సిలిండర్, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇలా చెప్పుకుటూపోతే ఎన్నో హామీలు అమలు చేసిందని అన్నారు.
Next Story






