- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ అంటే క్లాస్ అనుకున్నాం కానీ మాస్: మంత్రి వాకిటి శ్రీహరి
జూబ్లిహిల్స్ అంటే క్లాస్ అనుకున్నాం కానీ మాస్ ప్రాంతం అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయం ఖాయం అని చెప్పారు. 14వ తేదీ కోసమే ఎదురుచూస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జూబ్లిహిల్స్ అంటే క్లాస్ అనుకున్నాం కానీ మాస్ ప్రాంతం అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయం ఖాయం అని చెప్పారు. 14వ తేదీ కోసమే ఎదురుచూస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో మూడు సార్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేయలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో అర్ధరాత్రి 3 గంటలకు లేచి నీళ్లు పట్టుకునే పరిస్థితి ఉందన్నారు.
జూబ్లిహిల్స్ అంటే ఒకప్పుడు సంపన్నుల నియోజకవర్గం అనుకున్నామని కానీ ఇంచార్జ్ గా వచ్చి చూసిన తరవాత 80 శాతం మాస్.. క్లాస్ లేని ప్రాంతంలా ఉందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. కంటోన్మెంట్ లో గెలిచిని ఏడెనిమిది నెలలకే రూ.800 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. అదే విధంగా జూబ్లిహిల్స్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ మూడు పర్యాయాలు ఇచ్చిన నిధులను కాంగ్రెస్ రెండు నెలల్లోనే ఇచ్చిందన్నారు.






