- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తడిసిన ధాన్యం తప్పకుండా కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చి ధాన్యం తడిసిన కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చి ధాన్యం తడిసిన కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అకాల వర్షాలకు తడిసిన 9,214 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు చెప్పారు. బుధవారం ధాన్యం కేంద్రాలో ఉన్న పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రివర్గ సహచరులు, జిల్లా కలెక్టర్లు, పోలీస్,రవాణా శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగే ఏ చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకొబోదన్నారు. ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో అదీ రబీ సీజన్ లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించిందని తెలిపారు.
ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా అందులో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఇప్పటివరకు రూ. 10,097 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. దీంతో 8.15 లక్షల మంది రైతులకు లబ్ది కలిగిందని, కొనుగోలులో రాష్ట్రం సరికొత్త రికార్డ్ సృష్టించిందన్నారు. కొనుగోలు చేసిన 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకాల ధాన్యం కాగా 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని వివరించారు. ఇసుక సరఫరా చేసే లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించి సత్వరమే ధాన్యాన్ని మిల్లులకు రవాణ చేసేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రైతాంగానికి ఎక్కడ ఆటంకాలు ఏర్పడ కుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.






