- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) భాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు బ్యారెజీల మరమ్మతుల పనులు వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవాళ కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పునరుద్ధరణ పరీక్షపై ఆప్రీ ఇండియా ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్రీ ఇండియా, ఐఐటీ ముంబయి కి డిజైన్ల బాధ్యతలు అప్పగించారు. డిజైన్లను సెంటర్ వాటర్ కమిషన్‍కు పంపాలని నిర్ణయించారు. మరమ్మతు పనుల కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం సూచించారు. మేడిగడ్డ దగ్గర ఎన్డీఎస్ఏ సూచనతో డ్రిల్లింగ్ చేస్తూ పరీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.






