- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరకొండ నియోజకవర్గంలో 14 వేల రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం కూడా ఇస్తున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క నల్గొండ జిల్లాలోనే లక్ష రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో మహిళాభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఉచిత బస్సు సౌకర్యం, సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్, బస్సులకు యజమానులుగా.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. విపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని కోరారు.






