- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి ఉత్తమ్ చెప్పేది ఒకటైతే జరిగేది ఇంకొకటి.. హరీష్ రావు సంచలన కామెంట్స్
మంత్రి ఉత్తమ్ చెప్పేది ఒకటైతే జరుగుతున్నది ఇంకొకటి అని, ఇది రైతు కంటక ప్రభుత్వం అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) కామెంట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి ఉత్తమ్ చెప్పేది ఒకటైతే జరుగుతున్నది ఇంకొకటి అని, ఇది రైతు కంటక ప్రభుత్వం అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) కామెంట్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై హాట్ కామెంట్స్ చేశారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు.
అలాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని, క్వింటాల్‌కి 2,320 రూపాయలు మద్దతు ధర రావాల్సి ఉండగా దళారులకు 2,000, 2,100 రూపాయలకే అమ్ముకుంటున్నారని అన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల భయంతో రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని దళారులకి అమ్ముకునే దుస్థితి నెలకొందని, గతేడాది వానాకాలంలో మొత్తం 1 లక్షా 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే సేకరించిందని తెలిపారు.
మిగతా 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బయటకి వదిలేసిందని, అంటే మూడొంతుల్లో ఒక వంతు మాత్రమే కొనుగోలు చేయగలిగిందని, రెండొంతుల ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారని చెప్పారు. యాసంగి పంటకు కూడా ప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం కనబడుతోందని, ఇది రైతు కంటక ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి చేయలేదని, రైతు బంధుని వానకాలంలో ఎగగొట్టి యాసంగిలో రెండు మూడు ఎకరాలకే ఇచ్చారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, గాలి దుమారం వల్ల మూడు నాలుగు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని, అందుకు ఎకరాకి 20 వేల రూపాయలను ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక నంగునూరు మండలం పాలమాకుల వడ్ల కొనుగులు కేంద్రంలో వడ్లు కొని వారం అయినా ఇంకా రైతులకి డబ్బులు ఇవ్వలేదని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఏమో 48 గంటల్లో రైతులకు డబ్బులను అకౌంట్లో వేస్తున్నామని హైదరాబాద్‌లో చెప్తారని ఎద్దేవా చేశారు. గన్నీ బ్యాగులు నాణ్యంగా లేకపోవడం వల్ల హమాలీలకు ఇబ్బందిగా ఉందని, తూకంలో క్వింటాకి రెండు కిలోలు తరుగు తీస్తున్నారని అన్నారు. అటు అకాల వర్షాలు, ఇటు రైతు బంధు, మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని వెంటనే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరపున ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.






