సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో ఒక రోజు భోజనం చేయాల్సిందే: మంత్రి ఉత్తమ్

by velandi.Saikiran |   (  Updated:2025-04-10 12:41:47  IST  )

ప్రజా ప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో ఒక రోజు భోజనం చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార

సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో ఒక రోజు భోజనం చేయాల్సిందే: మంత్రి ఉత్తమ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజా ప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో ఒక రోజు భోజనం చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister N Uttam Kumar Reddy ) స్పష్టం చేశారు. ఇవాళ సన్నబియ్యం పంపిణీ, రేషన్ షాప్ ల నిర్వహణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ పై కీలక ప్రకటన చేశారు. సన్నబియ్యం విషయంలో ప్రతి పక్షాల ఆరోపణలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

కేంద్రం ( centrol government) ఇచ్చేది దొడ్డు బియ్యమే.. సన్న బియ్యం ఇస్తోందన్నది అవాస్తవం అని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం ( centrol government) ఇచ్చే బియ్యానికి 20 శాతం ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( telangana state) చెల్లిస్తుందని చెప్పారు. గతంలో సంవత్సరానికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశామని స్పష్టం చేశారు.

ఇప్పుడు 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ( Free Rice) సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ. 13,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister N Uttam Kumar Reddy ). తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే దిశగా అడు గులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ లను అమలు చేస్తున్నామన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

Next Story