- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విభజన చట్టాన్ని ఏపీ అనుసరించలేదు: బనకచర్లపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
బనకచర్ల విషయంలో విభజన చట్టాన్ని ఏపీ అనుసరించలేదని మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Banakacharala Project)పై తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minsiter Uttam Kumar Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల నీటి పంచాయితీపై చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. బనకచర్లపై తమ అభ్యంతరాలను జనవరిలోనే కేంద్రానికి లేఖ రాసినట్టు వెల్లడించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitaraman) దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అనుసరించడంలేదన్నారు. జీఆర్ఎంబీ(GRMB) నుంచి టెక్నికల్ అనుమతులు తీసుకోకుండానే బనకచర్లను చేపడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ కూడా ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యనించారు. ఈనెల 28న సీఆర్ పాటిల్ స్పందించి లేఖ రాశారని, గోదావరి, బనకచర్ల ప్రాజెక్టును పరిశీలిస్తామని చెప్పారని ఉత్తమ్ గుర్తు చేశారు. చట్ట వ్యతిరేకంగా కేంద్రం అనుమతులివ్వదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హాయంలోనే కృష్ణానదిపై మోసం జరిగిందన్నారు. నీటి హక్కుల కోసం ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ పేర్కొన్నారు.






