- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌వి పిచ్చిమాటలు.. మంత్రి ఉత్తమ్ ఫైర్
కేటీఆర్ ప్రాజెక్టులపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ ప్రాజెక్టులపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ ఆలమట్టి ప్రాజెక్ట్ పై చేసిన కామెంట్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్ట్ స్టే ఉందని తెలిపారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎత్తు పెంచకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయ వాది వైద్యనాథన్ ను నియమించినట్లు వెల్లడించారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలో కాంగ్రెస్ హయంలోనే తెలంగాణకు న్యాయం జరిగిందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు.
రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పంట మొత్తం కొనుగోలు చేయాలి..
రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వరి పంట మొత్తాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం ముందుకు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని... అయితే కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల వరకే ప్రొక్యూర్మెంట్‌కు అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. దీంతో 28 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు సమస్య తలెత్తి, రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. మిగిలిన ధాన్యం కూడా ప్రొక్యూర్ మెంట్ కు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని గోదాముల్లో, రైస్ మిల్లులో ధాన్యం నిండిపోయి ఉందని... ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ధాన్యం తరలించాల్సి ఉంటుందన్నారు. ధాన్యం తలింపు కోసం 300 రేక్స్ (గూడ్స్ రైళ్లు) ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. అందుకే మంగళవారం ఉదయం ఉత్తమ్ ఢిల్లీకి బయలుదేరుతున్నట్లు వెల్లడించారు.






