బీఆర్ఎస్ హయాంలో ఆ పనిచేసి ఉంటే.. బనకచర్ల వివాదం ఉండేదే కాదు: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బనకచర్ల ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తీవ్రంగా మండిపడ్డారు.

బీఆర్ఎస్ హయాంలో ఆ పనిచేసి ఉంటే.. బనకచర్ల వివాదం ఉండేదే కాదు: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఎంతో దెబ్బ తిన్నదని అన్నారు. తెలంగాణను సర్వనాశనం చేసి.. ఏం తెలియనట్లు హరీష్ రావు(Harish Rao) అబద్ధాలు మాట్లాడుతున్నాడని సీరియస్ అయ్యారు. హరీష్ రావు పేరు మార్చుకొని.. గోబెల్స్ రావుగా నామకరణం చేసుకోవాలని హితవు పలికారు. గత పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం ప్రాజెక్టుల డిజైన్లు మార్చి.. అంచనాలు పెంచి.. వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని అన్నారు. గోదావరిపై ప్రాజెక్ట్ కడితే బనకచర్ల వివాదం ఉండేదే కాదని చెప్పారు. అనంతరం ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. జాన్ పహాడ్ ఎత్తిపోతల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరిగినట్లు అనిపిస్తే.. నిర్మోహమాటంగా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బనకచర్ల ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుంటామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రయోజనాలకు కలిగే నష్టంపై బలమైన వాదనలు వినిపిస్తామన్నారు.

Next Story