బనకచర్ల‌తో అన్యాయం జరిగితే సుప్రీంకు వెళ్తాం.. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్

by Ramesh Naini |

బనకచర్ల చట్టవ్యతిరేకమైన ప్రాజెక్టు అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

బనకచర్ల‌తో అన్యాయం జరిగితే సుప్రీంకు వెళ్తాం.. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బనకచర్ల చట్టవ్యతిరేకమైన ప్రాజెక్టు అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు (Minister Uttam Kumar Reddy) కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. గోదావరి-బనకచర్లపై మాకు ఉన్న ఆందోళనలను కేంద్ర మంత్రికి వివరించామని చెప్పుకొచ్చారు. ఇవాళ (గురువారం) బనకచర్ల వివాదంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ (Union Minister for Jal Shakti CR Patil)తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో గంటకు పైగా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో ఏపీ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తోందని ఫిర్యాదు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

బనకచర్ల (Banakacharla Project) నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఏపీ పునర్విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు, రైతులలో ఆందోళనలు ఉన్నాయని చెప్పినట్లు వివరించారు. మేము చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని సీఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరిగితే సుప్రీం కోర్టుకు వెళ్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

Next Story