ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి కీలక రిక్వెస్ట్

by Ramesh Naini |

రాష్ట్రంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన పారా బాయిల్డ్ రబీ కోట అదనపు కేటాయింపులు చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సానుకూలంగా స్పందించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంస్థ ఎండీ ఆశుతోష్ అగ్నిహోత్రికి విజ్ఞప్తి చేశారు.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి కీలక రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన పారా బాయిల్డ్ రబీ కోట అదనపు కేటాయింపులు చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సానుకూలంగా స్పందించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంస్థ ఎండీ ఆశుతోష్ అగ్నిహోత్రికి విజ్ఞప్తి చేశారు. శనివారం సచివాలయంలోని సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రెండు పంట సీజన్​ల కోసం కేంద్ర ప్రభుత్వం 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కేటాయించిందని రబీ నుంచి ఇప్పటి వరకు 17.06 లక్షల మెట్రిక్​టన్నుల పారా బాయిల్డ్, 0.87 లక్షల మెట్రిక్​టన్నుల ముడి బియ్యం సరఫరా చేయడం జరిగిందన్నారు. ఇంకా 2.34 లక్షల మెట్రిక్​టన్నులు పార్ బాయిల్డ్, 14.26 లక్షల మెట్రిక్​టన్నుల ముడి బియ్యం సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు. ఈ రబీ సీజన్ లో పారా బాయిల్డ్ రైస్‌కు అనుకూలంగా ఉంటుందని రబీ కింద అదనంగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ కేటాయింపు చేయాలని కోరారు. పారా బాయిల్డ్ రైస్ తరలింపు కోసం అదనపు రేక్‌ల అవసరం ఉంటాయని ప్రస్తుత సంవత్సరం రేక్ తరలింపు గత సంవత్సరంతో పోలిస్తే 13.5 లక్షల మెట్రిక్​టన్నుల కొరత ఉందని వివరించారు.

ఎఫ్​సీఐ గోడౌన్లలో పారాబాయిల్డ్ బియ్యం నిల్వలు పేరుకుపోయాయని, దీంతో సీఎంఆర్ ​డెలివరీలు ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎఫ్​సీఐ డిపోల నుంచి పారాబాయిల్డ్ బియ్యం తరలింపును వేగవంతం చేయడానికి అదనపు రేక్‌లను కేటాయించాలన్నారు. ఖరీఫ్ కోసం సీఎంఆర్​బియ్యం సరఫరా వ్యవధి పొడిగించాలని, డెలివరీ సమయం గత నెల12న ముగిసిందని వివిధ కారణాలతో ఇప్పటికీ 2.27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉందని గడువు మరో 60 రోజుల పొడిగించాలని కోరారు. తెలంగాణలో నిల్వ సామర్థ్యం పెంపుదల చేయాలని ప్రస్తుతం నిల్వ సామర్థ్యం 65 లక్షల మెట్రిక్ ​టన్నులు ఉందని వివిధ ప్రభుత్వ సంస్థలు పూర్తిగా వీటిని ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. ఎఫ్​సీఐ అద్దెకు తీసుకోగల గోడౌన్ల రకంపై పరిమితుల కారణంగా నిల్వ కొరతను ఎదుర్కొంటుందన్నారు. నిల్వ పరిమితులతో సకాలంలో సీఎంఆర్​ డెలివరీలు చేయలేకపోతున్నామని సంబంధిత నిల్వ పథకం కింద ఎఫ్​సీఐ ద్వారా అదనంగా 15 లక్షల మెట్రిక్​టన్నుల నిల్వ సామర్థ్యాన్ని మంజూరు చేయాలన్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రభుత్వం 18 లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉన్నందున, ఖరీప్​ కోసం 10 నుంచి 12 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ అదనపు కోటా ఇవ్వాలని కోరారు.

మిల్లర్లు ప్రస్తుత ధాన్యం సేకరణ విషయంలో వెనుకాడుతుండటం వల్ల మిల్లుల వద్ద స్థలం లేకపోవడంతో కొత్త ధాన్యం సేకరణ మీద ప్రభావం చూపుతుందన్నారు. 8 సంవత్సరాల హామీతో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా రాష్ట్రం మరిన్ని గోడౌన్లను నిర్మాణం చేయడానికి పీఈజీ పథకాన్ని పునరుద్ధరించాలని సూచించారు. రెండు సంవత్సరాల రాష్ట్ర హామీ, ఆరు సంవత్సరాల ఎఫ్సీఐ హామీతో ప్రైవేటు భాగస్వామ్యంతో ఇస్తే నిల్వ సామర్థ్యం పెంచుకోవచ్చని అన్నారు. తదుపరి 4 నెలలకు నెలకు 0.5 లక్షల బాయిల్డ్ రైస్ తరలించవచ్చని పేర్కొన్నారు.

Next Story