- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం.. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో ఉత్తమ్ చిట్‌చాట్ నిర్వహించారు. బనకచర్లను అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం.. ఇంకా ఏం ప్రయత్నాలు చేయాలో అవి కూడా చేస్తామని తెలిపారు. రెండ్రోజుల్లో ఈ అంశంపై మరిన్ని వివరాలు వెల్లడిస్తా అని అన్నారు. చాలా తీవ్రంగా తాము బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లాం.. తమ అభ్యంతరాలు ఏంటో క్లియర్‌గా చెప్పామని అన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో మేం ఒప్పుకోం. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని కీలక ప్రకటన చేశారు.
ఇదిలా ఉంటే.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం(AP Govt) కేంద్రం ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు పూర్తి వివరాలు అందించనున్నారు. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టుతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖ అధికారులు వివరించనున్నారు. గత నెలలో జరిగిన భేటీల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని, ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు వివరించిన విషయం తెలిసిందే. సీఎం ప్రతిపాదనలపై పూర్తి వివరాలు ఇవ్వాలని గతంలో కేంద్ర ఆర్థికశాఖ కోరగా.. ఇవాళ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.






