- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో కాంగ్రెస్ వ్యూహమిదే: వెల్లడించిన మంత్రి ఉత్తమ్
ఈనెల 23న తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు బహుముఖ వ్యూహం రూపొందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 23న తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు బహుముఖ వ్యూహం రూపొందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందించి ఎన్నికల బరిలో విజయం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లుగా ఆయన వెల్లడించారు. శనివారం చెన్నైలో నియోజకవర్గ స్థాయి పార్టీ పరిశీలకులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సీనియర్ పరిశీలకుడిగా, స్టార్ క్యాంపెయినర్‌గా నియమిస్తూ ఇటీవల పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార వ్యూహం, సమన్వయంతో పాటు పార్టీ సంస్థాగత పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై తనతో పాటు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ముఖుల్ వాస్నిక్, ఖాజా మోహినోద్దీన్ లతో కలసి సమీక్షించినట్లుగా ఆయన తెలిపారు. డీఎంకేతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి అవసరమైన మార్గదర్శనం గురుంచి నియోజకవర్గ స్థాయి పరిశీలకులతో చర్చించానని మంత్రి ఉత్తమ్తెలిపారు. నియోజకవర్గ పార్టీ యంత్రాంగాన్ని రాష్ట్ర స్థాయి నాయకత్వంతో సమన్వయం చేయడం, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు.






