- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయాన్ని గర్వంగా ప్రచారం చేయండి.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి ఉత్తమ్ కీలక పిలుపు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్(Parliament)లో విపక్షాలకు గొంతే లేకుండా చేశారని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పారు. ‘జై బాపు, జైభీమ్, జై సంవిధాన్’ అనేది కాంగ్రెస్ నినాదమని.. ఈ నినాదాన్ని క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తపై ఉందని అన్నారు. బీజేపీ(BJP) ప్రజస్వామ్యాన్ని అణిచివేస్తోందని ఫైర్ అయ్యారు. సామాజిక న్యాయం కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పాటుపడుతోందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేశామని అన్నారు.
సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా ఉండటంతో పాటు ఎస్సీ వర్గీకరణ(SC Classification)కు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణతో ఎవరికీ అన్యాయం జరుగదని హామీ ఇచ్చారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.. ఎవరూ చేయలేని పనిని కాంగ్రెస్ చేసి చూపించిందని గర్వంగా చెప్పాలని పార్టీ శ్రేణులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకున్నాం.. మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. రైతులకు రుణమాఫీ(Runa Mafi) చేశాం.. రైతు భరోసా చెల్లించాం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాదిలోనే అనేక పనులు చేశామని.. అన్నీ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నిక(Election of local bodies)ల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని.. దానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అంతకుముందు ఇంతకాలం తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)కు ఏఐసీసీ ఇన్‌చార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షీకి ధన్యవాద తీర్మానం పెట్టారు.






