SLBC ప్రాజెక్ట్ అప్డేట్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

SLBC ప్రాజెక్ట్ అప్డేట్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే దేవరకొండ భాగంలోని ఔట్ లెట్ సొరంగ మార్గం 20 మీటర్ల దూరం తవ్వకం పూర్తి జరిగిందన్నారు. ఎస్.ఎల్.బీ.సీ పునరుద్ధరణ పనుల పురోగతిపై శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివరిస్తూ శ్రీశైలం నుండి ఇన్ లెట్ సొరంగ మార్గం పనులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారని, తవ్వకాలలో భద్రతా చర్యలకే పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అవసరమైన గాలి ప్రసరణతో పాటు సొరంగ మార్గం తవ్వేటపుడు వచ్చే నీటిని తొలగించేందుకు చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

భూభౌతిక పరిస్థితిలకనుగుణంగా టన్నెల్ బోర్ మిషన్ విధానాన్ని విరమించుకుని అత్యాధునిక పరిజ్ఞానంతో తవ్వకాలు ప్రారంభించినట్లు తెలిపారు. సురక్షిత మార్గాలు అన్వేషించి అదనంగా వెంటిలేషన్, విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకున్నట్లు వివరించారు. 2025 ఫిబ్రవరి నెలలో తవ్వకాలలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాద ఘాటనను దృష్టిలో పెట్టుకొని అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2028 జూన్ నాటికి ఎస్.ఎల్.బీ.సీని పూర్తి చేసేందుకు రూపొంచిన ప్రణాళికలననుసరించి 24 గంటలు మూడు షిఫ్ట్‌లలో పనులు చేపడుతున్నామన్నారు. అందుకు గాను సొరంగ మార్గం-1, సొరంగ మార్గం 2లలో తవ్వకాలకు సంబంధించిన ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. నిర్ణీత గడువులోపు పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

Next Story