నేనే స్వయంగా హాజరవుతా.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే లేదని, అడ్డుకుని తీరుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తేల్చిచెప్పారు.

నేనే స్వయంగా హాజరవుతా.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే లేదని, అడ్డుకుని తీరుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తేల్చిచెప్పారు. ముమ్మాటికి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ 1980 అవార్డ్‌తో పాటు అంతర్: రాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు చూపిస్తున్న లేఖ సీడబ్ల్యూసీ అంతర్గతంగా సమాచారం కోసం పంపిందేనని.. అది సీడబ్ల్యూసీ ఆమోదించింది కాదని తెలిపారు. రాష్ట్ర జల హక్కులపై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని.. ఆ పార్టీ నాయకుల ఆరోపణలు అర్థరహితమని కొట్టి పారేశారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలతోపాటు కేంద్ర జల కమిషన్, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంపై ఈ సంస్థలన్నీ ఏకీభవించాయని పేర్కొన్నారు. డిసెంబర్ 4న సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖనే ఇందుకు నిదర్శనమన్నారు. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టులోనూ న్యాయ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు.

మళ్లీ స్టే ఆర్డర్ కోరతాం

ఇదే ప్రాజెక్టును ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కుడా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం తరఫున గట్టి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్విని నియమించినట్లు తెలిపారు. సోమవారం జరగాల్సిన వాదనలు వచ్చే మళ్లీ సోమవారానికి వాయిదా పడ్డాయని.. రిట్ పిటిషన్‌ను సూట్ పిటిషన్‌గా మార్చి దాఖలు చేయాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే సోమవారం జరగనున్న వాదనలకు తాను స్వయంగా హాజరవుతానని, మళ్లీ స్టే ఆర్డర్ కోరతామని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో న్యాయవాదులతో ప్రత్యేకంగా మరోసారి సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలువరించడంలో విజయం సాధించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడిందన్నారు. బీఆర్ఎస్ పాలకులు జల వనరుల నిర్వహణలో ఘోరంగా విఫలం అయ్యారని మండిపడ్డారు. వారి పాలనలో మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు. జూరాల నుండి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలానికి, తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద రీ డిజైన్ చేయడం రాష్ట్ర భవిష్యత్ తరాల మీద మోయలేని భారాన్ని మోపారని అన్నారు.

Next Story