మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-31 12:06:05  IST  )

బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చను ప్రారంభించారు.

మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చను ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడ్డాక అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరంను మొదలుపెట్టారు. రూ.87,449 కోట్లతో నిర్మాణం చేపట్టారు. కట్టిన కొన్ని నెలలకే ప్రాజెక్టుకు గుండెకాయ అయిన మేడిగడ్డ కుంగింది. రూ.21 వేల కోట్లతో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కట్టారు. 20 నెలలుగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నాయి. తాము ప్రాణహితపై 2014 నాటికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. వాప్కోస్‌ రిపోర్ట్‌ కంటే ముందే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలని అప్పటి ప్రభుత్వం డిసైడయ్యింది. వాప్కోస్‌ రిపోర్ట్‌ ఇచ్చినరోజే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించాలని ఆదేశించింది.

ఏడాది 195 TMCల నీళ్లను ఎత్తిపోస్తామని చెప్పారు. ఐదేళ్లు కలిపి 125 TMC నీళ్లను మాత్రమే ఎత్తిపోశారు. ఇందులో 35 TMCల నీళ్లను సముద్రంలోకి వదిలిపెట్టారు. లక్షకోట్లతో కట్టిన ప్రాజెక్టుతో ఐదేళ్లలో వాడుకున్న నీళ్లు 101 TMCలు మాత్రమే అని మంత్రి ఉత్తమ్‌ విమర్శించారు. తాము కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోకపోయినా రికార్డు స్థాయిలో పంట పడిందని సభ ముందు చెప్పారు. గొప్పలకు పోయిన కట్టిన ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయింది. బీఆర్ఎస్ నేతలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ కూలడానికి చాలా కారణాలు ఉన్నాయని NDSA చెప్పింది. దేశంలోనే అతిపెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం నిర్మాణం. అధికారులు హెచ్చరించినా ఆనాడు కేసీఆర్ వినలేదని మంత్రి ఉత్తమ్ సభకు వివరించారు.

Read More..

TG Assembly: కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభం

Next Story